AP: వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు గురువారం కీలక వ్యాఖ్యలు చేశారు. కొంతమంది పోలీస్ అధికారులు చట్టాన్ని అతిక్రమిస్తున్నారు.. వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదన్నారు. నిబంధనలు అతిక్రమించిన పోలీసు అధికారులను ఎవ్వరినీ వదలం.. కచ్చితంగా చట్టం ముందు దోషులుగా నిలబెడతామని అంబటి హెచ్చరించారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన తప్ప ఏమీ లేదు.. ప్రజలు సూపర్ సిక్స్ హామీలు ఎక్కడ అని ప్రశ్నిస్తున్నారన్నారు.