AP: ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా పనులు చేస్తే ఊరుకునేదిలేదని కాంట్రాక్టర్లకు మంత్రి టీజీ భరత్ వార్నింగ్ ఇచ్చారు. కర్నూలు మున్సిపల్ కౌన్సిల్ హాలులో అధికారులు, కాంట్రాక్టర్లతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తక్కువ ధరకే పనులు దక్కించుకోవడంపై మండిపడ్డారు. తక్కువ ధరకు పనులు దక్కించుకుంటే నాణ్యతతో ఎలా చేస్తారని ప్రశ్నించారు. వార్డుల్లో చేపట్టే పనుల్లో నాణ్యత తగ్గించే ఉద్దేశం తమకు లేదన్నారు.