AP: మంత్రి సత్యకుమార్ యాదవ్ మంగళవారం అధికారులు వార్నింగ్ ఇచ్చారు. వైద్యశాఖలో అవినీతి సహించబోమని స్పష్టం చేశారు. అవినీతికి సంబంధించి ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సచివాలయంలో వైద్యారోగ్య శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. 'ఆరోగ్య రంగానికి అధిక నిధులు కేటాయించాం. వీటితో ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు, మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలి" అని ఆయన అన్నారు.