ఏపీలోని నిరుద్యోగ యువతకు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శుభవార్త చెప్పారు. రాష్ట్రంలో ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించారు. 7 నెలల్లో సీఎం చంద్రబాబు కృషితో.. రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులువచ్చాయని అచ్చెన్నాయుడు వెల్లడించారు. ఉద్యోగాల కల్పనలో భాగంగా 17,500 డీఎస్సీ ఉద్యోగాలు ఇస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.