ఏపీలోని యువతకు ఉద్యోగాలు కలిస్తామని సీఎం చంద్రబాబు మంగళవారం కర్నూలు సభలో తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ ద్వారా, ప్రైవేట్ సంస్థల నుంచి ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక ప్రైవేట్ కంపెనీలు రాష్ట్రానికి క్యూ కడుతున్నాయని తెలిపారు. వర్క్ ఫ్రమ్ హోం విధానాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు.