AP: రాష్ట్రంలోని ఐటీ అభివృద్ధికి అండగా ఉండాలని కేంద్ర మంత్రులను కోరినట్లు ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఢిల్లీలోని పలువురు కేంద్ర మంత్రులను కలిసి తర్వాత మీడియాతో మాట్లాడారు. 'ఏపీలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి కేంద్ర మంత్రులకు వివరించామని, వివిధ శాఖల మంత్రులతో ఆయా సమస్యలపై చర్చించినట్లు తెలిపారు. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్న మాటకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.