శివారు భూములకు సాగునీరు అందిస్తాం: మంత్రి సంధ్యారాణి

26చూసినవారు
శివారు భూములకు సాగునీరు అందిస్తాం: మంత్రి సంధ్యారాణి
AP: తోటపల్లి ప్రాజెక్టు నుంచి శివారు భూములకు సాగునీరు అందిస్తామని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. తోటపల్లి ప్రాజెక్టు కుడి ప్రధాన కాలువకు కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరితో కలిసి ఆదివారం సాగునీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తోటపల్లి, జంఝావతి, పూర్ణపాడు-లాబేసు వంతెన నిర్మాణం పనులను పూర్తిచేసేందుకు చర్యలు చేపడతామన్నారు. ఐటీడీఏ పీవో, వైరిచర్ల వీరేశ్ చంద్రదేవ్, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్