AP: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయని మంత్రి నారా లోకేశ్ అన్నారు. శుక్రవారం అనంతపురం జిల్లా బేతపల్లిలో మాట్లాడుతూ.. రాయలసీమలో రెన్యూ విద్యుత్ కాంప్లెక్స్ ఏర్పాటుతో 10 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు.