అంబేడ్కర్ విదేశీ విద్యా దీవెనను మళ్లీ ప్రారంభిస్తాం: సీఎం చంద్రబాబు

71చూసినవారు
అంబేడ్కర్ విదేశీ విద్యా దీవెనను మళ్లీ ప్రారంభిస్తాం: సీఎం చంద్రబాబు
AP: అంబేడ్కర్ విదేశీ విద్యా దీవెనను మళ్లీ ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. సోమవారం గుంటూరు జిల్లా పొన్నకల్లులో చంద్రబాబు మాట్లాడుతూ.. ‘కుల వివక్షకు వ్యతిరేకంగా అంబేడ్కర్ పోరాడారు. దళితులకు టీడీపీ ఎప్పుడూ అండగా ఉంటుంది. దళితులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. సబ్ ప్లాన్ ద్వారా దళితుల అభివృద్ధికి కృషి చేస్తాం. రెసిడెన్షియల్ స్కూళ్లలో మెరుగైన భోజనం, నాణ్యమైన విద్యను అందిస్తున్నాం.’ అని తెలిపారు.

సంబంధిత పోస్ట్