AP: మాజీ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి సమన్లు పంపేందుకు మహిళా కమిషన్ సిద్ధమైంది. సజ్జలకు బుధవారం సమన్లు పంపిస్తామని మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ శైలజ తాజాగా వెల్లడించారు. సజ్జల వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని కోరుతామన్నారు. అమరావతి మహిళలపై సాక్షి ఛానెల్‌లో జర్నలిస్టు కృష్ణంరాజు చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై నిరసన తెలుపుతున్న మహిళలను ఉద్దేశించి సజ్జల నోరు పారేసుకున్న సంగతి తెలిసిందే.