చిన్నారుల కలల సాకారానికి అండగా నిలుస్తాం: మంత్రి లోకేశ్‌

534చూసినవారు
చిన్నారుల కలల సాకారానికి అండగా నిలుస్తాం: మంత్రి లోకేశ్‌
AP: చిన్నారులు తమ కలలను సాకారం చేసుకునేందుకు అండగా నిలుస్తామని మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. తమకు చదువు చెప్పించాలంటూ నెల్లూరు కమిషనర్‌కు ఇద్దరు చిన్నారులు విజ్ఞప్తి చేయడంపై మంత్రి నారా లోకేశ్‌ స్పందించారు. చిన్నారులు పెంచలయ్య, వెంకటేశ్వర్ల చదువుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. పేదరికం నుంచి బయటకు తెచ్చే ఒకే ఒక్క సాధనం విద్య అని తెలిపారు.

సంబంధిత పోస్ట్