‘పీ4’ (పబ్లిక్-ప్రైవేట్-పీపుల్స్-పార్టనర్‌షిప్) విధానానికి సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక అప్‌డేట్ ఇచ్చారు. పేదరిక నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ విధానాన్ని ఉగాది పండుగ నుంచి ప్రారంభించనున్నట్టు స్పష్టం చేశారు. ఈ విధానం ద్వారా సమాజంలో ఆర్థికంగా అగ్రస్థానంలో ఉన్న 10 శాతం మంది.. అట్టడుగున ఉన్న 20 శాతం మందికి చేయూతనివ్వడం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చని పేర్కొన్నారు.