పెళ్లి సీజన్‌లో అనేక వెడ్డింగ్‌కార్డులు వివిధ కారణాల వల్ల వైరల్ అవుతాయి. ఇటీవల, ఒక ప్రత్యేకమైన వెడ్డింగ్ కార్డు ఇంటర్నెట్‌లో చాలా మంది దృష్టిని ఆకర్షిస్తోంది. కేరళలోని పతనంతిట్ట జిల్లాలోని ఇలంగమంగళం గ్రామంలో ఫిబ్రవరి 2న జరిగిన ఒక వివాహానికి సంబంధించినదే ఈ వెడ్డింగ్ కార్డు. వరుడు ‘రేషన్ షాప్ బాయ్’గా స్థానికంగా పాపులర్ అవడంతో పెళ్లి కూతురు ఇలా డిజైన్ చేయించిందని సమాచారం.