సార్వత్రిక ఎన్నికలలో ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులు రిసెప్షన్ కేంద్రంలో కీలకమైన బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుందని ఆచంట నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి సోమనాయుడు తెలిపారు. ఎన్నికలకు సంబంధించి ఇతర బ్యాలెట్ యూనిట్స్ పనితీరు, డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్ల వద్ద నిర్వహించే విధులు బాధ్యతలపై పీఓలు, ఎంపీఓలకు ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలపై బుధవారం శిక్షణా కార్యక్రమం నిర్వహించామన్నారు.