భీమవరం పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులలో అలసత్వం వహించవద్దని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అధికారులకు సూచించారు. ఒకటో పట్టణంలోని సింహాద్రి అప్పన గుడి రోడ్డులో జరుగుతున్న డ్రెయినేజీ కల్వర్టు పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. మురుగునీరు చెత్త రోడ్డు మీద ఉండకూడదని, పనులను శరవేగంగా జరపాలని సూచించారు.