గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మంతెన సీతారాం కోరారు. భీమవరం సిపిఎం జిల్లా కార్యాలయంలో జెఎన్వి. గోపాలన్ అధ్యక్షతన సిపిఎం జిల్లా కమిటీ సమావేశం గురువారం జరిగింది. సమావేశంలో ప్రజా సమస్యలపై చర్చించారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సీతారాం మాట్లాడుతూ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి, మంత్రివర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.