నరసాపురం వైఎన్ కళాశాల ప్రాంగణంలో నేడు నిర్వహించనున్న ఉద్యోగ దిక్సూచి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ నాగరాణి సూచించారు. సంబంధిత అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె గురువారం మాట్లాడారు. ముఖాముఖిలో ఎంపికైన వారు కచ్చితంగా ఉద్యోగాల్లో చేరేలా వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. అవసరమైతే మరో రెండు రోజులు అవకాశం కల్పించాలని సూచించారు.