
అత్యాచారం చేసిన యువతికి కోర్టులో ప్రపోజ్.. నిందితుడి శిక్ష రద్దు!
సుప్రీంకోర్టులో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. అత్యాచారం కేసులో సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. కేసు విచారణలో భాగంగా కోర్టులోనే నిందితుడు బాధితురాలికి లవ్ ప్రపోజ్ చేయడంతో.. అతడికి శిక్షను రద్దు చేసింది. కోర్టు గదిలోనే ఒకరికొకరు పూలు ఇచ్చిపుచ్చుకోవాలని, నిందుతుడు, బాధితురాలు వివాహం చేసుకోవాలని కోరింది. ఇక ఈ వివాహ వివరాలను తల్లిదండ్రులు నిర్ణయిస్తారని కోర్టు తీర్పునివ్వడం గమనార్హం.