ఆర్టీసీ అందిస్తున్న కార్గో సేవలు, రవాణా సేవల్లో సమస్యల పరిష్కారం కోసం డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నరసాపురం ఆర్టీసీ డిపో మేనేజర్ ఎస్. సుబ్బన్నరెడ్డి చెప్పారు. శుక్రవారం నరసాపురం డిపో లో డిపో పరిధిలోని నరసాపురం, మొగల్తూరు, పాలకొల్లు, యలమంచిలి, పెనుగొండ, ఆచంట చుట్టు పక్కల ప్రాంతాల వారు తమ సమస్యలు, సూచనలు, సలహాలు ఉదయం 11 నుంచి 12 గంటల వరకూ ఫోన్ ద్వారా ఫిర్యాదురు స్వీకరించారు.