నరసాపురం పట్టణంలో మంగళవారం అనుమానస్పద మృతిలో తెన్నేటి బ్లేస్సి (24) కేసులో అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు, నరసాపురం పట్టణ సీఐ యాదగిరి తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బుధవారం బ్లేస్సి శవ పంచనామా పూర్తి చేసినట్లు తెలిపారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా కేసును పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.