నరసాపురం మండలం రాజుగారితోటలో రూ. 25 లక్షలు, సీతారామపురం సౌత్ గ్రామంలో రూ. 40 లక్షల ఉపాధి హామీ పథకం నిధులతో నిర్మిస్తున్న సీసీ రహదారి పనులకు ఎమ్మెల్యే నాయకర్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. రహదారుల నిర్మాణానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.