నరసాపురం బీసీవైపి అసెంబ్లీ అభ్యర్థిగా సీనియర్ న్యాయవాది ఆకుల

54చూసినవారు
నరసాపురం బీసీవైపి అసెంబ్లీ అభ్యర్థిగా సీనియర్ న్యాయవాది ఆకుల
భారత చైతన్య యువజన పార్టీ నరసాపురం అసెంబ్లీ అభ్యర్థిగా ఆకుల వెంకట స్వామి పేరు ప్రకటించారు. ఆ పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ బుధవారం మొదటి జాబితాలో వెంకట స్వామికి టిక్కెట్ కేటాయించారు. గతంలో జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలీగల్ సెల్ ఉపాధ్యక్షులుగా, నరసాపురం పార్లమెంటరీ కో ఆర్డినేటర్ గా పనిచేసారు. అనంతరం పార్టీలో నచ్చక ఆయన రాజీనామా చేశారు. నరసాపురంలో కౌన్సిలర్, న్యాయవాదిగా పనిచేసారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్