బాల్య వివాహాలను ప్రోత్సహిస్తే కఠిన చర్యలు: సిడీపీవో

67చూసినవారు
బాల్య వివాహాలను ప్రోత్సహిస్తే కఠిన చర్యలు: సిడీపీవో
బాల్య వివాహాలను ప్రోత్సహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సిడీపీవో మమత అన్నారు. శనివారం నరసాపురం ఎంపీడీవో కార్యాలయంలో చైల్డ్ మ్యారేజ్ ప్రొటెక్షన్ కమిటీ ఒక్క రోజు ట్రైనింగ్ నిర్వహించారు. ఐసీడీఎస్ సీడీపీవో ఊర్మిళ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మమత మాట్లాడుతూ.. బాల్య వివాహాలు అరికట్టడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలన్నారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పలు అంశాలపై అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్