పాలకొల్లు హిందూ స్మశాన వాటికలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు. పాలకొల్లు పట్టణ హిందూ స్మశాన వాటికను అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. అక్కడ నత్త నడకన సాగుతున్న మసాలా అభివృద్ధి పనులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మరింత వేగంగా పనులను పూర్తి చేయాలని సూచించారు. మున్సిపల్ అధికారులు టిడిపి నాయకులు పాల్గొన్నారు.