కౌలు రైతులకు ప్రభుత్వం గుర్తింపు కార్డులు ఇవ్వాలి

65చూసినవారు
పెంటపాడు మండలంలో ఎక్కువ శాతం కౌలు రైతులు ఉన్నారని వారికి తక్షణమే ప్రభుత్వం కౌలు రైతు గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి కళింగ లక్ష్మణరావు డిమాండ్ చేశారు. ఈ విషయమై బుధవారం స్థానిక తహసీల్దారు కార్యాలయము నందు డిప్యూటీ తహసీల్దారు యు. వెంకటేశ్వర్లు కు వినతి పత్రం అందజేశారు. మండల రైతు సంఘం నాయకులు వంకా అప్పారావు, కొణతాల నాగరాజు, సుబ్బారావు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్