చినతాడేపల్లి గ్రామంలో నేను బడికి పోతా కార్యక్రమం

51చూసినవారు
చినతాడేపల్లి గ్రామంలో నేను బడికి పోతా కార్యక్రమం
తాడేపల్లిగూడెం మండలం చినతాడేపల్లి గ్రామంలో గురువారం నేను బడికి పోతా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు స్టూడెంట్ కిట్లు, పుస్తకాలు, బ్యాగులు పంపిణీ చేశారు. తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ పరిమి రవికుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అత్తింటి తాతయ్య, చిటికెన శ్రీనివాస్, ఎన్ఆర్ఐ చందు, ఎంపీటీసీ సభ్యులు సత్తయ్య, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్