గర్భిణులు సకాలంలో ఆహారం తీసుకోవాలని, బిడ్డ ఎదుగుదల బాగుంటుందని ఐసీడీఎస్ సూపర్వైజర్లు
దుర్గభవాని, విశాలాక్షి అన్నారు. తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం తాడేపల్లిగూడెం పట్టణం 18, 20వ
వార్డులలో తల్లిపాల ఆవశ్యకత, పౌష్ఠికాహార వినియోగంపై అవగాహన కల్పించారు. బిడ్డ పుట్టిన అరగంటలోపు తల్లి ముర్రుపాలు తాగించాలన్నారు. తద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుందన్నారు. అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.