శాఖంబరీ దేవి అలంకరణలో కుంకుళ్లమ్మ అమ్మవారు

51చూసినవారు
ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల ప్రసిద్ధ శ్రీ కుంకుళ్లమ్మ అమ్మవారి ఆలయం శ్రావణ శుక్రవారం పురస్కరించుకుని భక్తులతో కిటకిటలాడింది. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున విచ్చేశారు. శాఖంబరీ దేవి అలంకరణలో కుంకుళ్లమ్మ అమ్మవారు భక్తులకు దర్శనం ఇచ్చారు. ఆలయంలో చండీ హోమం, ప్రత్యేక కుంకుమార్చనలు జరిపారు.

సంబంధిత పోస్ట్