ఏకత్వం, మానవత, అంత్యోదయ సిద్ధాంతాలను, ప్రజలకు మంచి పాలనను గ్రామ స్థాయిలో అందించేందుకు కృషి చేసిన మహానీయుడు దీన్ దయాళ్ ఉపాధ్యాయ అని బీజేపీ రాష్ట్ర నాయకులు కోట రాంబాబు అన్నారు. మంగళవారం తాడేపల్లిగూడెం కిరాణా వర్తక సంఘ భవనంలో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ వర్ధంతి నిర్వహించారు. దీన్ దయాల్ జీవిత చరిత్రను ప్రతి బీజేపీ కార్యకర్త తెలుసుకోవాలన్నారు. పట్టణ బాధ్యుడు దువ్వ శ్రీను, రాంబాబు పాల్గొన్నారు.