తణుకు నియోజకవర్గానికి సంబంధించి లెక్కింపు ఏర్పాట్లు పూర్తి

64చూసినవారు
సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ఈనెల 4న జరగనున్న నేపథ్యంలో భీమవరంలో విష్ణు కళాశాలలో తణుకు నియోజకవర్గానికి సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. తణుకు నియోజవర్గంలో మొత్తం 233 పోలింగ్ బూత్ లకు సంబంధించి 14 టేబుల్స్ ఏర్పాటు చేశారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కోసం మరో నాలుగు టేబుల్స్ ఏర్పాటుచేసి మొత్తం 17 రౌండ్లలో తుది ఫలితాన్ని వెల్లడించనున్నారు. తణుకు రిటర్నింగ్ అధికారి రమణ ఆధ్వర్యంలో లెక్కింపు జరగనుంది.

సంబంధిత పోస్ట్