30 ఏళ్ల సుదీర్ఘ పోరాటానికి సుప్రీంకోర్టులో వర్గీకరణ పై వెలువడిన తీర్పు చారిత్రాత్మకమైన నిర్ణయం అని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు అబ్బదాసరి లాజర్ కొనియాడారు. గురువారం సుప్రీం కోర్టులో వర్గీకరణపై వెలువడిన తీర్పు మేరకు తణుకు నరేంద్ర కూడలి వద్ద ఎమ్మార్పీఎస్ నాయకులు సంబరాలు చేశారు.