రైతులకు ఆమోదయోగ్యమైన భూ రీసర్వే చేపట్టేందుకే గ్రామ సభలను నిర్వహిస్తున్నామని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. శుక్రవారం పాలకోడేరు మండలంలోని శృంగవృక్షంలో భూ రీసర్వేలో లోటుపాట్లను తెలుసుకునేందుకు ఏర్పాటు చేసిన గ్రామసభలో ఆమె సంబంధిత అధికారులతో కలిసి పాల్గొన్నారు. రైతులతోపాటు కలెక్టర్ కూడా నేలమీద పరిచిన బరకంపై కూర్చుని రైతుల సమస్యలు, సూచనలు అడిగి తెలుసుకున్నారు.