పెనుమంట్ర మండలం పెనుమంట్ర, బ్రాహ్మణచెరువు సచివాలయాల పరిధిలో శనివారం మధ్యాహ్నానికి 90% పెన్షన్ల పంపిణీ పూర్తి చేసినట్లు వెల్ఫేర్ అసిస్టెంట్ ప్రసాద్ తెలిపారు. వేకువజాము నుండే పంపిణీ ప్రారంభించి వర్షం మధ్యలోనూ కొనసాగించామని పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో వివిధ హోదాల సచివాలయం ఉద్యోగులు పాల్గొన్నారు.