వీర జవాన్ మురళి నాయక్ కు ఘన నివాళి

55చూసినవారు
వీర జవాన్ మురళి నాయక్ కు ఘన నివాళి
జమ్మూ కాశ్మీర్లో విధులు నిర్వహిస్తూ వీర మరణం పొందిన జవాన్ మురళి నాయక్ కు శనివారం పెనుగొండ ఎస్వీకేపీ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘన నివాళులర్పించారు. ముందుగా మురళి నాయక్ కు చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ రక్షణ కోసం పాకిస్తాన్ తో పోరాడుతూ అమరుడైన మురళి నాయక్ చిరస్మరణీయుడని కొనియాడారు

సంబంధిత పోస్ట్