టీటీడీలో గో మరణాలపై వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి చేస్తున్న అసత్య ప్రచారాలు మానుకోవాలని ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ ఈ సందర్భంగా ఆచంట టీడీపీ కార్యాలయం నుండి ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. అసత్య ప్రచారంతో మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్న కరుణాకర్ రెడ్డిని ప్రజలు నమ్మరన్నారు. టీటీడీపై అసత్య ప్రచారాలు చేస్తున్న అతనిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.