పెనుమంట్ర మండలం మార్టేరు మానవత జనరల్ సెకట్రరీ హోదాలో ఉండి గత సంవత్సరం మార్చురీ ఫీజెర్లు, అంబులెన్స్ లను సకాలంలో బాధితులకు సమకూర్చడం, చదువు నిమిత్తం ఆర్థిక సహాయం వంటి సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొన్న చిర్ల వంశీ హరినాథ్ రెడ్డిని మానవతా జిల్లా ప్రెసిడెంట్, సూర్యనారాయణ మూర్తి, డాక్టర్ రామచంద్రరావు చేతుల మీదుగా సన్మానించి, జ్ఞాపికను అందచేశారు. చిన్న వయసులో సేవాగుణం కలిగి ఉండడం అభినందనీయమని కొనియాడారు.