ఆచంట: దివ్యాంగురాలిపై భర్త వేధింపులు.. కేసు నమోదు

81చూసినవారు
ఆచంట: దివ్యాంగురాలిపై భర్త వేధింపులు.. కేసు నమోదు
ఆచంట మండలం పెనుమంచిలికి చెందిన లక్ష్మీనారాయణ తన కుమార్తె లక్ష్మీదుర్గను అదే గ్రామానికి చెందిన వీరమల్లు నాగరాజుతో 2014లో వివాహం చేశారు. దుర్గకు పుట్టుకతోనే మూగ, చెముడు ఉన్నాయి. అదనపు కట్నం కోసం దుర్గను నాగరాజు, అతడి తల్లిదండ్రులు వేధిస్తున్నట్లు లక్ష్మీనారాయణ గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటరమణ తెలిపారు.

సంబంధిత పోస్ట్