ఆచంట నియోజవర్గ కన్వీనర్ కే. హెచ్. వి. ప్రసాద్ రెడ్డి అధ్యక్షతన బిజెపి ఆచంట అసెంబ్లీ క్రియాశీలక కార్యకర్తల సమావేశం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ పాల్గొన్నారు. కార్యకర్తలకు పార్టీ చేస్తున్న పనులు ప్రజలలోకి తీసుకువెళ్లాలని దిశనిర్దేశం చేసారు. కష్టపడే ప్రతీ కార్యకర్తకు బీజేపీ పార్టీలో ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.