ఆచంట: వాతావరణం మార్పులతో రైతులు ఆందోళన

52చూసినవారు
ఆచంట: వాతావరణం మార్పులతో రైతులు ఆందోళన
ఈ సంవత్సరం దాల్వా పంట బాగా పండింది. మరో వారం పది రోజుల్లో పంటచేతికోస్తుంది. ఈ లోపు వాతావరణంలో మార్పు రైతులకు కంటినిండా కునుకు లేకుండా చేస్తోంది. పెనుగొండ మండలంలో మంగళవారం ఉదయం ఎండ కాసిందని వడలి, దేవ తదితర గ్రామాల్లో యంత్రాలతో కోసిన ధాన్యాన్ని రైతులు ఆరబెట్టారు. మధ్యాహ్నం తిరిగి మబ్బులు కమ్మేయడంతో రైతులు ఉరుకులు పరుగులతో తమ ధాన్యాన్ని పోగు చేసుకుని, బరకాలు కప్పుకొనే పనిలో నిమగ్నమయ్యారు.

సంబంధిత పోస్ట్