ధాన్యం కొనుగోలు విషయంలో మధ్యవర్తులు ఎవరైనా రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. ఆచంట నియోజకవర్గంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద పరిస్థితి ఆయన శుక్రవారం అడిగి తెలుసుకున్నారు. తుఫాన్ హెచ్చరిక నేపథ్యంలో రైతులు ఎక్కడ ఇబ్బందులు లేకుండా పూర్తిస్థాయి ధాన్యం కొనుగోళ్లు జరగాలని అధికారులకు సూచించారు. ధాన్యం కొనుగోళ్ళలో మధ్యవర్తులు ఎవరుండకూడదన్నారు.