ప్రతి ఒక్కరూ సమాచార హక్కు చట్టంపై అవగాహన కలిగి ఉండాలని పెనుగొండ మండల డిప్యూటీ తహసిల్దార్ టి. రాజేష్ అన్నారు. మంగళవారం ఎంపీడీవో కార్యాలయంలో సమాచార హక్కు చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారదర్శకత కోసమే సమాచార హక్కు చట్టాన్ని రూపొందించాలని ప్రతి ఒక్కరూ సమాచార హక్కు చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎంపీడీవో సూపర్డెంట్ రమేష్, ఎంఈఓ. టి శుభాకారావు, ఉద్యోగులు పాల్గొన్నారు.