పెనుమంట్ర మండలం బ్రాహ్మణచెరువు గ్రామంలో ఏఎన్ఎం లక్ష్మీ, ఆశా సిబ్బంది ఆధ్వర్యంలో శనివారం ఎన్సీడీ 3.0 సర్వే నిర్వహించారు. గ్రామ ప్రజలకు వివిధ రకాల ఆరోగ్య పరీక్షలు చేసి, సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించారు. ఎలాంటి అనారోగ్య లక్షణాలున్నా తక్షణమే తమను సంప్రదించాలని ఏఎన్ఎం గ్రామస్థులకు సూచించారు.