పెనుమంట్ర మండలంలోని మార్టేరు గ్రామంలో గల శివరావుపేట ప్రాంతంలో 251, 37 అంగన్ వాడీ కేంద్రాలలో శుక్రవారం ముందస్తు సంక్రాతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్ వాడీ టీచర్లు సరస్వతి, భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో, పిల్లలచే సంక్రాంతి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం గంగిరెద్దుల ప్రదర్శన చేయించారు.