మంగళగిరిలో దళితులు నడిచిన రహదారిని పసుపు నీళ్లతో కడిగిన ప్రీతిపై తక్షణమే ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నన్నేటి పుష్పరాజ్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా శనివారం ఆచంటలో ఆయన మాట్లాడారు. అవమానం పొందిన కుటుంబాలకు ప్రభుత్వం ధైర్యం చెప్పాలన్నారు. ఈ ఘటనను ఎస్సీ కమిషన్ సీరియస్‌గా తీసుకోవాలని, లేదంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం తప్పదని హెచ్చరించారు.