పెనుగొండ పట్టణంలోని కొంతమంది అంగన్వాడీ కేంద్రాలు ప్రభుత్వం నిర్దేశించిన సమయానికి అనుగుణంగా పనిచేయడం లేదు. వేసవికాలం నేపథ్యంలో ఉదయం 8 నుండి మధ్యాహ్నం 12 వరకు అంగన్వాడీ కేంద్రాలు పనిచేయాలని ప్రభుత్వం ఆదేశించినా, కొన్నిచోట్ల 9 గంటలకు తెరిచి 11 గంటలకే మూసేస్తున్నారు.శనివారం రాజుగూడెం అంగన్వాడీ కేంద్రం ఉదయం 9 గంటలకైనా తెరవకపోవడాన్ని స్థానికులు ఆవేదనతో పేర్కొన్నారు.