పెనుమంట్ర తహసీల్దార్ ఆఫీస్ లో విఆర్ఏగా పనిచేస్తున్న ఏసు ఇటీవల కనబరిచిన ప్రదర్శనకు గాను ఉత్తమ విఆర్ఏగా కలెక్టర్ నాగారాణి, మంత్రి నిమ్మల రామానాయుడు చేతులు మీదుగా అవార్డు అందుకున్నారు. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా గురువారం భీమవరం కలెక్టర్ ఆఫీస్ లో నిర్వహించిన అవార్డుల ప్రధానోస్థవ కార్యక్రమంలో అవార్డును అందచేశారు. ఈ సందర్భంగా ఏసుకు పలువురు రెవిన్యూ సిబ్బంది అభినందనలు తెలిపారు.