మానవతసేవల్లో చూపిన విశేష కృషికి గుర్తింపుగా పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఇటీవల ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్రస్థాయి అవార్డ్ ను రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ గారి చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్బంగా బుధవారం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణిని తణుకు శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ కలిసి పూల బొకే అందించి శుభాకాంక్షలు తెలిపారు.