మార్టేరు లో విరబూసిన బ్రాహ్మ కమలం పువ్వులు

54చూసినవారు
మార్టేరు లో విరబూసిన బ్రాహ్మ కమలం పువ్వులు
పెనుమంట్ర మండలం మార్టేరు గ్రామంలోని చింత నారాయణ రెడ్డి, తమనంపూడి శ్రీనివాస్ రెడ్డి ఇళ్ల ఆవరణలో శుక్రవారం బ్రహ్మ కమల పుష్పాలు విరిసాయి. హిందూ పురాణాల ప్రకారం ఈ బ్రహ్మ కమలం పుష్పాన్ని దైవంగా భావిస్తారు. ఈ పుష్పం రాత్రిపూట వికసిస్తుంది. పుష్పాన్ని చూడటం అరుదైన అదృష్టంగా భావిస్తారు. ఈ పుష్పం వైద్య పరంగా కూడా ఉపయోగపడుతుంది. ఈ పుష్పాన్ని ఇంట్లో ఉండటం ద్వారా శక్తి వస్తుందని ప్రజల నమ్మకం.

సంబంధిత పోస్ట్