కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా పెనుగొండ మండలంలోని వడలి గ్రామం నుండి రామన్నపాలెం వరకు ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ నేతృత్వంలో గురువారం భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని నినాదాలతో ఊహించని ఉత్సాహాన్ని ప్రదర్శించారు. గ్రామాల్లో ప్రజల నుంచి మంచి స్పందన లభించింది.