దెందులూరు: పద్మశ్రీ కుటుంబాన్ని పరామర్శించిన ఎంపి

77చూసినవారు
దెందులూరు:  పద్మశ్రీ కుటుంబాన్ని పరామర్శించిన ఎంపి
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గంట పద్మశ్రీప్రసాద్ అత్త గంట అచ్చమాంబ ఇటీవల మృతి చెందారు. విషయం తెలిసిన ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్టా మహేష్ కుమార్ శనివారం దెందులూరు నియోజకవర్గం పెదపాడు మండలం సత్య వోలు గ్రామంలోని జడ్పీ చైర్ పర్సన్ గంట పద్మశ్రీ ప్రసాద్ ఇంటికి వెళ్లి అచ్చమాంబ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పద్మశ్రీ ప్రసాద్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.

సంబంధిత పోస్ట్